![]() |
![]() |

ఒక్కోసారి మనం కంగారు, భయంలో.. సరిగా ఆలోచించలేక తొందర్లో ఏదోకటి చేసేసి గాయాలపాలవుతుంటాం. రీసెంట్ గా బాలీవుడ్ నటి కరిష్మా శర్మకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కంగారులో ఆమె కదులుతున్న రైలు నుంచి దూకి గాయాలపాలైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా తానే పంచుకుంది. (Karishma Sharma)
రన్నింగ్ ట్రైన్ నుండి దూకడంతో గాయాలతో ఆసుపత్రి పాలైనట్లు తాజాగా కరిష్మా శర్మ తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ పెట్టింది. "చర్చిగేట్ లో జరగనున్న షూటింగ్ కి వెళ్లడం కోసం ట్రైన్ ఎక్కాను. కానీ, నా ఫ్రెండ్స్ ఆ ట్రైన్ అందుకోలేకపోయారు. దీంతో భయంతో కదులుతున్న రైలు నుంచి దూకేశాను. నా వీపుకి, తలకు గాయాలయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం.. డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నాను. పెయిన్ ఉన్నప్పటికీ, నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మీ ప్రేమే నాకు బలం." అని కరిష్మా శర్మ రాసుకొచ్చింది.
కరిష్మా శర్మ త్వరగా కోలుకోవాలంటూ సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

![]() |
![]() |